వికారాబాద్ జిల్లాలో రూ.10 కోట్ల పనులు ప్రారంభం

వికారాబాద్ జిల్లాలో రూ.10 కోట్ల పనులు ప్రారంభం

వికారాబాద్, వెలుగు: మెరుగైన రవాణా సౌకర్యం కోసం గ్రామాల్లో పెద్ద మొత్తంలో రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​తెలిపారు. మోమిన్ పేట మండలంలో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ ఉమేశ్,  తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీఓ విజయ లక్ష్మి, హౌసింగ్ డీఈ, ఈఈ సయ్యద్ సాజిద్, శిరాజుద్దీన్ పాల్గొన్నారు.