గాంధీలో పెయిన్​ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌పై ముగిసిన వర్క్‌‌‌‌ షాప్‌‌‌‌

గాంధీలో పెయిన్​ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌పై ముగిసిన వర్క్‌‌‌‌ షాప్‌‌‌‌

పద్మారావునగర్​, వెలుగు:  మోకాలి, నడుము నొప్పి నివారణకు సరికొత్త వైద్య విధానాలపై రాష్ట్రంలోని డాక్టర్లకు గాంధీ అలుమ్ని ఆడిటోరియంలో రెండు రోజుల వర్క్‌‌‌‌షాప్​ నిర్వహించారు.  ఆదివారం జరిగిన వర్క్‌‌‌‌షాప్‌‌‌‌లో రాష్ర్టంలోని  పలు జిల్లాలతో  పాటు  సిటీ నుంచి వచ్చిన దాదాపు 150  మంది పెయిన్​ ఫిజిషీయన్స్, అనస్తీషియా వైద్యులు హాజరయ్యారు.  గాంధీ పూర్వ విద్యార్థి అమెరికాలో  స్థిరపడిన డాక్టర్​రామ్ పసుపులేటి సహకారంతో గాంధీ అనస్తీషియా విభాగం ఆధ్వర్యంలో నూతన వైద్య విధానాలు  వివరించారు. 

ఈ సందర్భంగా డాక్టర్‌‌‌‌‌‌‌‌ రామ్​ పసుపులేటి మాట్లాడుతూ..  ఇండియాలో ఇటీవల కాలంలో మోకాలి, నడుము నొప్పులు బాగా పెరిగిపోయాయన్నారు.   గాంధీలో 2017లో ప్రారంభమైన పెయిన్‌‌‌‌ క్లినిక్‌‌‌‌కు సరైన వైద్య పరికరాలను ఇప్పటికే  డోనేట్‌‌‌‌ చేశామన్నారు.  గాంధీ అనస్తీషియా ప్రొఫెసర్​ డా.పి.శ్రీదేవి మాట్లాడుతూ..  గాంధీలో ఉచితంగా ట్రీట్​ మెంట్  ఇవ్వడానికి  డా.రామ్​ పసుపులేటి కృషితో పెయిన్​ క్లినిక్​ ఏర్పాటు చేశామన్నారు.  కార్యక్రమంలో చైర్​పర్సన్​ డా.హెచ్. ఎల్. బేబిరాణి, సెక్రటరీ డా.పి.శ్రీదేవి,  ట్రెజరర్​ డా.జి.నాగరాజ్​ గౌడ్​, మెంబర్స్​ డా.అబ్బయ్య, డా.జుబేర్, డా. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.