అది చైనీస్ వైర‌స్.. ప్ర‌పంచం మొత్తానికి తెలుసు

V6 Velugu Posted on Apr 12, 2020

క‌రోనా వైర‌స్ పుట్టిందే చైనా దేశంలోని వుహాన్ న‌గ‌రంలోన‌ని, ఆ విష‌యం ప్ర‌పంచం మొత్తానికి తెలుస‌ని ఆ దేశ రాయ‌బారికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజ‌సింగ్. ఈనెల 5న ప్రధాని మోదీ పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో ‘చైనీస్‌ వైరస్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. ఆ విష‌యాన్ని త‌ప్పుప‌ట్టిన చైనా భారత్‌లోని త‌మ ఎంబసీ చేత ఓ లేఖ రాయించింది.
‘‘కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి హెచ్చరించిన తొలిదేశం చైనా అని.. దీని అర్ధం ఈ వైరస్ చైనా నుంచి పుట్టిందని కాదని.. చైనీస్ వైరస్ గో బ్యాక్ అని చేసిన నినాదాలను ఖండిస్తున్నామని భారత్‌లోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్ చై నా కౌన్సిలర్‌(పార్లమెంట్‌) లియూ బింగ్‌..రాజాసింగ్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన రాజాసింగ్.. ఆ రాయ‌బారి తిరిగి ఓ లేఖ రాస్తూ… క‌రోనా వైర‌స్ చైనీస్ వైర‌స్ అని ప్ర‌పంచం మొత్తం అంటుంద‌ని, అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా ఇది కరోనా వైరస్‌ కాదు.. చైనా వైరస్ అన్న‌ విషయాన్ని ప్రస్తావించారని.. ఇది నిజాం కాదా అంటూ ప్రశ్నించారు.
అంతే కాకుండా ఈ ఘోరమైన వైరస్ నుండి ప్రపంచాన్ని కాపాడాల‌ని, వీలైనంత త్వరగా వైర‌స్ ను అరిక‌ట్టేందుకు, వ్యాక్సిన్‌ను క‌నుగొనాల‌ని, అందుకోసం ప్ర‌పంచ‌ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కు మద్దతు ఇవ్వాలని చైనా ప్రభుత్వాన్ని కోరారు రాజాసింగ్‌ .

Tagged Covid-19, raja singh, BJP MLA, Chinese Embassy Official, Originated In China

Latest Videos

Subscribe Now

More News