వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌‌ షిప్‌.. క్వార్టర్ ఫైనల్లో జాస్మిన్

వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌‌ షిప్‌.. క్వార్టర్ ఫైనల్లో జాస్మిన్

లివర్‌‌పూల్: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా స్టార్ బాక్సర్ జాస్మిన్ లాంబోరియా (57 కేజీలు) పతకం దిశగా మరో అడుగు ముందుకేసింది. ఆదివారం రాత్రి జరిగిన ప్రి-క్వార్టర్ ఫైనల్ పోరులో జాస్మిన్ 5-–0 తేడాతో బ్రెజిల్‌‌కు చెందిన రెండుసార్లు ఒలింపియన్ జుసిలెన్ సెర్క్వెరాపై ఏకపక్ష విజయం సాధించింది. జాస్మిన్ క్వార్టర్స్‌‌లో గెలిచి సెమీస్ చేరితే కనీసం కాంస్యం ఖాయం చేసుకుంటుంది. అయితే, సాక్షి చౌదరి (54 కేజీ) 0–5  పారిస్ ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్‌‌, టర్కీకి చెందిన హటిస్ అక్బాస్ చేతిలో ఓడగా.. సనమాచ చాను (70 కేజీ) కూడా తన బౌట్‌‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.