సండే హో యా మండే రోజ్ ఖావో అండే !..అంబేద్కర్ స్కూల్లో గుడ్డు దినోత్సవం

సండే హో యా మండే రోజ్ ఖావో అండే !..అంబేద్కర్ స్కూల్లో గుడ్డు దినోత్సవం

ముషీరాబాద్, వెలుగు : ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకుని బాగ్‌లింగంపల్లి లోని డా. బీఆర్. అంబేద్కర్ స్కూల్​లో శ్రీనివాస ఫార్మ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్లు పంపిణీ చేశారు. పిల్లలకు గుడ్డు పోషక విలువలపై అవగాహన కల్పించారు. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుందని, ఇది శరీరంలో కండరాల నిర్మాణానికి ఉపయోగపడుతుందన్నారు. పచ్చసొనలో ఉండే కోలిన్ తింటే మెదడు పనితీరు మెరుగుపడడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతుందన్నారు.