న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బుధవారం యూట్యూబ్ సర్వీస్ డౌన్ అవడంతో లక్షలాది మంది యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్లోబల్ మొత్తంగా 16 లక్షలకు పైగా ఎర్రర్ రిపోర్టులు రాగా.. అత్యధికంగా అమెరికాలో 3.20 లక్షలకు పైగా యూజర్లు ప్రభావితమైనట్లు అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.
యూట్యూబ్ సర్వీస్ డౌన్ వల్ల ఇండియా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మెక్సికో వంటి దేశాల్లోనూ వేలాది మంది యూజర్లు సమస్యలు ఎదుర్కొన్నారు. యూట్యూబ్ యాప్, వెబ్‌సైట్, మ్యూజిక్, కిడ్స్ ప్లాట్‌ఫామ్‌లు అన్నీ ప్రభావితమయ్యాయి.
దీంతో వీడియోలు లోడ్ కాకపోవడం, హోమ్‌పేజీ యాక్సెస్ లేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. దీనిపై గూగుల్ స్పందిస్తూ..యూట్యూబ్ రెకమెండేషన్ సిస్టమ్‌లో టెక్నికల్ సమస్య వల్ల సర్వీస్ డౌన్ అయినట్లు తెలిపింది. కొన్ని గంటల్లోనే సర్వీస్‌ను పునరుద్ధరించినట్లు స్పష్టం చేసింది. కాగా.. యూట్యూబ్ సర్వీస్ డౌన్ కావడంపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు హాస్యాస్పదంగా, మీమ్‌లతో స్పందించారు.
