ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వినాయకుడి విగ్రహం...

ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వినాయకుడి విగ్రహం...

వినాయకుడు.. మన ఆది దేవుడు.. పూజలన్నింటిలోనూ వినాయకుడికే తొలి పూజ చేయడం మన సంప్రదాయం. అలాంటి వినాయకుడికి దేశంలో చాలా దేవాలయాలున్నాయి. అయితే ప్రపంచంలోనే  రెండో అది పెద్ద వినాయక విగ్రహం  గురించి ఇప్పుడు తెలుసుకుందాం. .  

ప్రపంచవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.  అయితే హర్యానాలోని బహదూర్ ఘర్ లో ప్రపంచ వ్యాప్తంగా రెండో అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.  గణపతి డ్యాం వద్ద వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు.  ఈ మండపాన్నా రంగు రంగుల పూలు, బెలూన్ లతో స్వామి వారిని అలంకరించారు. ఇక్కడ 2016 లో 74 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని నైపుణ్యం కలిగిన శిల్పులు రూపొందించారు.   గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.  స్థానిక పద్దతులు, సంస్కృతులు, హిందూ ధర్మం  ఆచార వ్యవహారాలననుసరించి పూజలు చేస్తారు.  భక్తులు స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.