మామూలుగా.. స్విమ్మింగ్ పూల్ ఎంత లోతుంటుంది? ఏడెనిమిది అడుగులు! మహా అయితే పదడుగులు. కానీ, 148 అడుగులు లోతైన స్విమ్మింగ్ పూల్ గురించి తెలుసా? పోలండ్ లోని మెసెజోనౌ అనే పట్టణానికి వెళితే చూసేయొచ్చు. ఈత కొట్టేయొచ్చు. 27 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ కలిపితే ఎంతుంటుందో.. అంత ఉంటుందీ స్విమ్మింగ్ పూల్ . దీని పేరు డీప్ స్పాట్ . పోలండ్ రాజధాని వార్సా వెస్ట్ కౌంటీలో ఇండోర్ స ్కైడైవింగ్ సి మ్యులేటర్ ఫ్లైస్పాట్ ను కట్టిన సంస్థే దీనినీ కట్టింది. దీనిని నింపాలంటే 8 వేల క్యూబిక్ మీటర్ల నీళ్లు కావాలట. ప్రస్తుతం ఇదే ప్రపంచంలో లోతైన స్విమ్మింగ్ పూల్ అయినా.. ఆ రికార్డు ఓ ఆరు నెలలు మాత్రమే ఉండబోతోంది. ఎందుకంటే.. బ్రిటన్ లోని కోల్షెస్టర్ లో అంతకన్నా లోతైన స్విమ్మింగ్ పూల్ ను కడుతున్నారు కాబట్టి. బ్లూ అబిస్ అనే ఆ స్విమ్మింగ్ పూల్ లోతు 164 అడుగులు. ఇక, డీప్‌స్ పాట్ కన్నా ముందు వై–40 డీప్ జాయ్ లోతైనది. దాని కన్నా.. డీప్ స్ పాట్ 16 అడుగులు ఎక్కువ. ఇటలీలోని మోంటెగ్రొటో టెర్మీ పట్టణంలో ఉంది వై–40 డీప్ జాయ్ .
డీప్ స్పాట్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు…
- బ్రెజిల్ లోని రియో డిజనీరోలో ఉన్న క్రైస్ట్ ద రిడీమర్ విగ్రహం ఎత్తు కన్నా డీప్ స్పాట్ లోతైనది. ఆ విగ్రహం ఎత్తు 125 అడుగులు.
- న్యూయార్క్‌లోని లిబర్టీ విగ్రహంలో సగం ఉంటుంది. లిబర్టీ విగ్రహం ఎత్తు 305 అడుగులు.
- 27 మందిని (సగటున ఆరడుగుల వ్యక్తులు) ఒకరిపై ఒకరిని నిలబడితే ఎంత ఎత్తు ఉంటారో.. అంత లోతుంటుంది.
