కేసీఆర్​తో మాట్లాడిస్తానంటే మీటింగ్​కు వస్తా!

కేసీఆర్​తో మాట్లాడిస్తానంటే మీటింగ్​కు వస్తా!
  • కేసీఆర్​తో మాట్లాడిస్తానంటే మీటింగ్​కు వస్తా!
  • గద్వాల సభకు ఆహ్వానించిన  టెలీ కాలర్​కు ఓటరు రిప్లై  
  • సోషల్ ​మీడియాలో  ఆడియో వైరల్​

గద్వాల, వెలుగు : తనను సీఎంకు కలిపించి సమస్యలు పరిష్కరిస్తానంటేనే సోమవారం గద్వాలలో జరగనున్న సభకు వస్తానని ఓ వ్యక్తి తనకు ఫోన్​చేసిన టెలీకాలర్​కు బదులిచ్చాడు. ఇప్పుడీ ఆడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. సీఎం కేసీఆర్ సోమవారం గద్వాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆఫీసు నుంచి జనాలకు ఫోన్ ​కాల్స్​ చేస్తూ సభకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామానికి చెందిన  రంగన్నకు ఓ టెలీ కాలర్ ఫోన్ చేసింది.

‘సార్.. రేపు సీఎం కేసీఆర్ గద్వాలకు వస్తుండు.. మీరు మీటింగ్ కు రావాలి’ అని కోరింది.  దీనికి రంగన్న ‘ గద్వాలకు కేసీఆర్ ఏం జేసిండు..ఆయన మాయమాటలతో అట్రాక్ట్​ చేస్తుండు. నేను భూ సమస్యతో 8 ఏండ్ల నుంచి  ఇబ్బంది పడుతున్నా. ఇప్పటికీ పరిష్కారం కాలే. ఏ పనులు అయితలేవు, మా సమస్యలన్నీ చెప్పుకునేందుకు సీఎం కేసీఆర్ ను కల్పిస్తానంటే చెప్పండి మీటింగుకు వస్తా’ అని సమాధానం ఇచ్చాడు. ‘ మీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటే చేస్తున్నా. అంతే తప్ప నేను మీ సమస్య పరిష్కరించలేను’ అని టెలీ కాలర్ చెప్పింది. ‘మేడం ఇలాంటి మోసకారి దగ్గర మీరు పని చేయొద్దు.. వేరే పని చూసుకోండి’ అంటూ రంగన్న సలహా ఇచ్చాడు.