కిష్టాపూర్​ గ్రామంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు

కిష్టాపూర్​ గ్రామంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు

బీర్కూర్, వెలుగు: మండలంలోని కిష్టాపూర్​ గ్రామంలో సోమవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. మే నెలలో వచ్చే పౌర్ణమి ఉదయం రథోత్సవం, అనంతరం జాతర నిర్వహిస్తామని, అందులో భాగంగా సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ పోటీలో ఆయా ప్రాంతాల మల్ల యోధులు పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగాయి. విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగొండ, శ్రీనివాస్​, అంజయ్య, కె.భరత్​ కుమార్​, పుల్లెని పీరయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.