రాంగ్రూట్ లో డ్రైవింగ్.. 10 వేల కేసులు

రాంగ్రూట్ లో డ్రైవింగ్.. 10 వేల కేసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో రాంగ్ రూట్ డ్రైవింగ్​పై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదాలను నివారించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి, వారంలో 10,652 మందిపై కేసులు నమోదు చేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రాణాంతకమని, దీన్ని పూర్తిగా మానుకోవాలని జాయింట్ సీపీ జోయల్ డేవిస్ సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను ఫేస్‌‌బుక్, ఎక్స్ ద్వారా లేదా హెల్ప్‌‌లైన్ నంబర్లు 9010203626, 8712661690కు ఫిర్యాదు చేయాలని సూచించారు.