ముచ్చటగా మూడోసారి.. 70 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడైన WWE స్టార్

ముచ్చటగా మూడోసారి.. 70 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడైన WWE స్టార్

డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ హల్క్ హోగన్(70) ముచ్చటగా మూడోసారి వివాహబంధంలోకి అడుగుటపెట్టారు. తన ప్రేయసి స్కై డైలీని సహచరులు, కుటుంసభ్యుల నడుమ ఘనంగా వివాహమాడారు. అమెరికాలోని ఫ్లోరిడాలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో దంపతులిద్దరూ 5 లక్షల డాలర్ల విలువైన డైమండ్ రింగులను మార్చుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివాహ సమయంలో దంపతులిద్దరూ వైట్ అండ్ బ్లాక్ దుస్తులు ధరించారు. హోగన్ టోపితో సహా అన్ని నల్లని దుస్తులే ధరించి అందంగా ముస్తాబవ్వగా.. వధువు స్కై డైలీ తెల్లటి స్ట్రాప్‌లెస్ గౌనులో కనిపించింది. స్కై డైలీకి కూడా ఇది మూడో వివాహం. ఆమెకు ఇది వరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ప్రస్తుతం హోగన్ యోగా శిక్షకుడిగా పని చేస్తుండగా.. స్కై డైలీ అకౌంటెంట్‌గా పని చేస్తోంది. 

Also Read :- కపిల్ దేవ్ కథ సుఖాంతం.. కరెంట్ కోతల్లేని మ్యాచ్‌ల కోసమే కిడ్నాప్

లక్ష డాలర్ల విలువైన ప్రేయసి..!

హల్క్ హోగన్ మొదటి భార్య పేరు.. లిండా. 1983లో వీరి వివాహం జరగగా.. వీరికి బ్రూక్, నిక్ అనే ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం కూతురు బ్రూక్ వయసు 35 ఏళ్లు. 2007లో లిండా విడాకులు ఇచ్చిన 3 సంవత్సరాల అనంతరం  2010లో జెన్నిఫర్ మెక్‌డానియల్‌ను వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఆపై 2021లో ఆమెకు గుడ్ బై చెప్పి.. స్కై డైలీతో డేటింగ్ మొదలుపెట్టారు. హోగన్ తన ప్రేయసి.. స్కై డైలీకి లక్ష డాలర్ల విలువైన ఆరు క్యారెట్ల డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశారు. ఈ విషయం అప్పట్లో ఓ పెద్ద వార్తే. కాగా, హల్క్ హోగన్ 1980లలో అత్యంత ప్రజాదరణ పొందిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ గా పేరు పొందారు.