కపిల్ దేవ్ కథ సుఖాంతం.. కరెంట్ కోతల్లేని మ్యాచ్‌ల కోసమే కిడ్నాప్

కపిల్ దేవ్ కథ సుఖాంతం.. కరెంట్ కోతల్లేని మ్యాచ్‌ల కోసమే కిడ్నాప్

భారత మాజీ దిగ్గజం కపిల్ దేవ్‌ను కొందరు అగంతకులు కిడ్నాప్‌ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆయన చేతులను వెనకవైపు తాడుతో కట్టేసి.. మాట్లాడటానికి వీల్లేకుండా నోటికి గుడ్డను కట్టి తీసుకెళ్తున్న వీడియో అందరినీ మరో కోణంలో చూసేలా చేసింది. అయితే అదంతా వాస్తవం కాదని తేలిపోయింది. ఓ యాడ్ కోసం షూట్ కోసమే ఆయనను బంధించారు.

తమ యాప్‌లో ఫ్రీగా ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూడొచ్చని చెప్పడం కోసం ప్రముఖ ఓటీటీ యాప్ హాట్ స్టార్ ఈ యాడ్‌ను రూపొందించింది. ఈ వీడియో మిగిలిన భాగంలో కొందరు వ్యక్తులు ఆయనను లాంతరు లైట్ల వెలుగులో ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లి కుర్చీలో కట్టేస్తారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిని చుట్టుముడతారు. అనంతరం ఓ పోలీసు అధికారి మైక్‌లో మాట్లాడుతూ కపిల్ దేవ్ పాజీని ఎందుకు కిడ్నాప్ చేశారు..? అని కిడ్నాపర్లను ప్రశ్నిస్తాడు.

అందుకు బదులిచ్చిన కిడ్నాపర్.. వరల్డ్ కప్ మ్యాచ్‌ల సమయంలో కరెంట్ కోతలు ఉండవని గ్యారెంటీ కావాలని అడుగుతాడు. అందుకు పోలీస్ అధికారి.. కరెంట్ గురించి టెన్షన్ ఎందుకు! డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో వరల్డ్ కప్ మ్యాచ్‌లను పూర్తి ఉచితంగా చూడొచ్చు అని చెప్పగా.. కిడ్నాపర్ ఐదు నిమిషాలే వస్తుంది కదా మరో ప్రశ్న సంధిస్తాడు. అందుకు సదరు అధికారి.. లేదు.. లేదు లేదు మ్యాచ్ మొత్తం చూడొచ్చు అని చెప్తాడు. మరి డేటా ఎవడిస్తడు..? అని కిడ్నాపర్ అడగ్గా.. డేట్ సేవింగ్ మోడ్ లో మ్యాచ్ ఉచితంగా చుడ్డొచ్చని చెప్పి వారిని శాంతిపచేశాడు. అనంతరం కిడ్నాపర్లు కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన వదిలేస్తారు. దీంతో ఆయన కిడ్నాప్ కథ సుఖాంతం అవుతుంది.

కపిల్ దేవ్‌ నిజంగానే కిడ్నాప్‌ అయినట్లు వీడియో పోస్ట్ చేసిన భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.