Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం నయా సెన్సేషన్.. 'పాన్-ఇండియా' రేంజ్‌క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

 Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం నయా సెన్సేషన్.. 'పాన్-ఇండియా' రేంజ్‌క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే 'కె-ర్యాంప్' మూవీతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం 'చెన్నై లవ్ స్టోరీ', 'క 2' చిత్రాల షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న కిరణ్.. మరో  క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో జతకట్టారు. పాన్ ఇండియా స్థాయిలో  సినీ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు ఒక భారీ మిథాలజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కు సిద్ధం అయ్యారు.

బడా నిర్మాతలతో..

ఈ చిత్రాన్ని   ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా (Ess Kay Gee Entertainment), జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్‌ నిర్మిస్తున్నారు.వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మిథాలజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ చిత్రం కూడా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఒక సరికొత్త లోకాన్నిపరిచయం చేయబోతోంది. 

హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో...

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టకు కీర్తన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిథాలజీ యాక్షన్ ఎంటర్‌టైనర్. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా, కళ్లకు కట్టే విజువల్ గ్రాండియర్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే ఈ మూవీ షూటింగ్  మొదలుపెట్టేందుకు మేకర్స్ పక్కా ప్లాన్‌తో రెడీ చేస్తున్నారు.

ఈ పాన్-ఇండియా రేంజ్ మూవీలో కిరణ్ సరసన ఎవరు మెరవబోతున్నారు అన్నది ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్. బాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరోయిన్‌ను గానీ, లేదా టాలీవుడ్ టాప్ బ్యూటీని గానీ తీసుకోవాలని నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆ పేరుతో పాటు, ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరనేది కూడా అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.

టాలీవుడ్ లోకి ఒక సాదాసీదా కుర్రాడిగా వచ్చి,.. నేడు బాలీవుడ్ దిగ్గజాలతో కలిసి పాన్-ఇండియా స్థాయిలో సినిమా చేయడం కిరణ్ అబ్బవరం ఎదుగుదలకు నిదర్శనం. ఈ విజువల్ వండర్ అటు భక్తిని, ఇటు యాక్షన్‌ను ఎలా మేళవిస్తుందో చూడాలి.