ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మూవీ ధురంధర్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. ఇందులోని స్పెషల్‌సాంగ్ (షరారత్) చార్ట్ బస్టర్గా నిలిచింది. ఇందులో అయేషా ఖాన్ తన డ్యాన్స్తో మెస్మరైజ్ చేసింది. ఈ పాటకు ఏకంగా 229 మిలియన్‌పైగా వ్యూస్వచ్చాయి.
ఇప్పుడు ఓటీటీలోనూ ధురంధర్ అదరగొడుతున్న టైంలోనే, షరారత్ సాంగ్ పై అయేషా ఖాన్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ‘సాంగ్ చేసే సమయంలో నేను పీరియడ్స్లో ఉన్న. రెండు రోజుల పాటు షూటింగ్ సాగింది. చాలా అలసిపోయా. అన్ కంఫర్ట్గా ఫీల్అయ్యా. కానీ నా బెస్ట్ ఇవ్వాలనుకున్న. ఎక్కువగా డ్యాన్స్ చేయడంతో ఎముకలు నొప్పులు కలిగించాయి. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఏడ్చేశా. బాధను తట్టుకున్న. సాంగ్ బాగా రావడంతో తర్వాత ఆనందంతో కూడిన కన్నీళ్లు వచ్చాయి’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలో ఆమె డెడికేషన్ కు ఫిదా అయిన నెటిజన్లు అయేషాకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. షరారత్ పాటను శాశ్వత్ సచ్ దేవ్ స్వరపరిచారు. మధుబంతి బాగ్చి, జాస్మిన్ శాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ కొరియోగ్రఫీ అందించారు. ఇకపోతే, బిగ్‌బాస్ సీజన్ 17 (హిందీ) ఫేం అయేషా ఖాన్.. తెలుగులో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో స్పెషల్ సాంగ్ చేసింది. మోత..మోత.. మోగిపోద్ది అనే పాటతోతన అందచందాలతో స్టెప్పులేసి అలరించింది.
►ALSO READ | Naga Chaitanya: బ్లాక్‌బస్టర్ ‘తండేల్’కు ఏడాది పూర్తి.. అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన చైతూ
