‘ఎక్స్’ సేవలు డౌన్.. క్లౌడ్ఫ్లేర్లో అంతరాయం ఎఫెక్ట్

‘ఎక్స్’ సేవలు డౌన్.. క్లౌడ్ఫ్లేర్లో అంతరాయం ఎఫెక్ట్

న్యూఢిల్లీ: ఇంటర్ నెట్ ట్రాఫిక్ ను మేనేజ్  చేయడంలో వెబ్ సైట్లకు సాయంచేసే క్లౌడ్ ఫ్లేర్  మంగళవారం (నవంబర్ 18) అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో మేజర్ ఆన్ లైన్  ప్లాట్ ఫామ్స్​ ఓపెన్  ఏఐ, ఎక్స్, స్పాటిఫై, కణ్వ, క్లౌడ్ తోపాటు ఇతర మేజర్  ప్లాట్ ఫాంల సేవలు స్తంభించిపోయాయి. 

లక్షల మంది యూజర్లు ఆ సైట్లను కాంటాక్ట్  చేయలేకపోయారు. ఉత్తర అమెరికా, యూరోప్, ఆసియా, లాటిన్  అమెరికాలో క్లౌడ్ ఫ్లేర్ స్తంభించిపోయిందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మెయింటెనెన్స్‌, ట్రాఫిక్  రీరూటింగ్ చేస్తున్న క్రమంలో క్లౌడ్ ఫ్లేర్  నిలిచిపోయిందని, ఇది తాత్కాలికమేనని పేర్కొంది. సమస్యను గుర్తించి సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.