భారత్- పాక్ యుద్దవాతావరణం.. 8వేలకు పైగా X అకౌంట్లు బ్లాక్

భారత్- పాక్ యుద్దవాతావరణం..   8వేలకు పైగా X అకౌంట్లు బ్లాక్

భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   భారత్ లో 8 వేల ట్విట్టర్( ఎక్స్) ఖాతాలను బ్లాక్ చేయాలని ఎలన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ను  ఆదేశించింది.    తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ట్విట్టర్ (X) ఖాతాలను మూసివేయాలని తమకు  ఆదేశాలు జారీ చేసిందని ఎక్స్ తెలిపింది.

చట్టాలను ఉల్లంఘించిన అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖుల అకౌంట్లను  బ్లాక్ చేయాలని లేకపోతే భారీ జరిమానా విధిస్తామని ఆదేశాలు వచ్చాయి. అయితే నిర్ధిష్టంగా ఏ అకౌంట్ల నుంచి చట్టాన్ని ఉల్లంఘించి సమాచారం పోస్ట్ చేయబడిందో  భారత  ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. చాలా సందర్భాల్లో భారత్  ఇలాగే  చేస్తుంది.  కేంద్ర ఆదేశాలను మేం పాటిస్తాం. అకౌంట్లను బ్లాక్ చేసే ప్రక్రియను స్టార్ట్ చేశాం.

భారత ప్రభుత్వ  నిర్ణయం  అంత తేలికైనది కాదు.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో  మేం విభేదిస్తున్నాం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అరించడమే. దీనిపై మేం చట్ట ప్రకారం ముందుకెళ్తాం.  అని ఎక్స్ కంపెనీ తన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.