MI Xiaomi:  ఎలక్ట్రిక్ కారు తయారు చేసిన షావోమీ

MI Xiaomi:  ఎలక్ట్రిక్ కారు తయారు చేసిన షావోమీ

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ షావోమీ ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి అడుగుపెట్టింది.  షావోమీ తయారు చేసిన ఎలక్ట్రిక్ కారు ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ ఫోటోల ప్రకారం కారు పేరు షావోమీ ఎంఎస్11 గా  ఉంది. సెడాన్ వెర్షన్ లో ఈ కారుని తీసుకురానున్నారు. కారుకు సంబంధించిన లుక్, డిజైన్  ఆకట్టుకుంటున్నాయి. 

ఈ కారు ఫ్రంట్ లుక్ చూడ్డానికి కొంత పోర్షే టైకాన్ కారు లాగా కనిపిస్తోంది. టాప్, బ్యాక్ లుక్  టెస్లా కారును తలపిస్తోంది.  కారు ముందు భాగంలో లైడార్ సెన్సార్ కనిపిస్తుండటంతో సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ తో వస్తుందని ఊహిస్తున్నారు. అలాయ్ వీల్స్ పై షావోమీ బ్రాండ్ లోగో ఉంది.