విరుచుకుపడుతున్న ‘యాస్’ తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ

విరుచుకుపడుతున్న ‘యాస్’ తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ

‘యాస్’ తుఫాన్ ఒడిశా, బెంగాల్‌లపై విరుచుకుపడుతోంది. ధమరా పోర్టులో తుఫాన్ తీరాన్ని తాకింది. అలలు విపరీతంగా విరుచుకుపడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని 9 జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం అతి తీవ్ర తుఫాన్ ‘యాస్’ ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉత్తర ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరప్రాంతాల్లో మరియు ఉత్తర ధమర, బాలాసుర్ దేశం మధ్యలో తీరం దాటనున్ననట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలోనూ ఇది అతి తీవ్ర తుఫాన్‌గానే ఉంటడం వల్ల గంటకు 130 నుండి 140 కిలో మీటర్ల వేగంతో.. ఒక్కోసారి 155 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యగా దీని ప్రభావం ఉత్తర ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ పైన ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అక్కడ తేలిక పాటి నుంచి మోస్తరు.. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు జారీ చేశారు. జార్ఖండ్, బీహార్, అస్సాం, మేఘాలయలోను భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో డ్యామేజ్‌లు ఎక్కువగా ఉంటాయని.. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.