పాటతో అలరించిన కలెక్టరమ్మ

పాటతో అలరించిన కలెక్టరమ్మ

యాదాద్రి భువనగిరి జిల్లా: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మహిళలు మగవారికి తీసిపోరన్నారు. మహిళలు తలుచుకుంటే సాధ్యంకానిదిలేదన్నారు. విద్య, ఉద్యోగంతో పాటు సాహిత్యరంగంలోనూ రాణించాలన్న ఆమె.. అందరిముందు ధైర్యంగా పాట పాడి అలరించారు. ఆకాశంలో సగం… అవకాశాల్లో సగం.. అన్నింటా సగం.. అంటూ ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల సంబరాలు కలెక్టర్ పమేలా సత్పతి ఉద్యోగులతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాట పడి మహిళ దినోత్సవంలో  ఉద్యోగుల మనోధైర్యం నింపారు. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు’ అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ..ఉద్యోగుల స్ఫూర్తి సందేశం ఇచ్చారు. పాటలు, డాన్స్, వ్యాయామంతో పాటు .. మారుతున్న రోజులతో మనిషి జీవనశైలి మారాలన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పుకొచ్చారు యాదాద్రి భువనగిరి కలెక్టరమ్మ పమేలా సత్పతి. కాగా ఇటీవల ఆమె కూతరుని అంగన్ వాడీ స్కూల్ చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే.