- అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సదానందం యాదవ్
కోల్‌బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో మంచిర్యాల జిల్లాలో యాదవ భవనాలు ఏర్పాటు చేస్తున్నామని కాంగ్రెస్ నేత, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం యాదవ్అన్నారు. శనివారం మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాలతో జిల్లా, మండల, మున్సిపల్, పట్టణ, గ్రామా కమిటీలను నియమిస్తామన్నారు. సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, ప్రభుత్వపరమైన సంక్షేమ ఫలాల కోసం మంత్రి, ఎంపీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. యాదవ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సమావేశంలో కులసంఘం జిల్లా యూత్ అధ్యక్షులు గంగాధర్ యాదవ్, ఉపాధ్యక్షుడు అల్లంల పావన్న, అల్లంల నాగన్న, జన్నారం మండల ప్రెసిడెంట్ బొంతల మల్లేశ్, మందమర్రి టౌన్ ప్రెసిడెంట్ సిలివెరీ గోపాల్, యూత్ అధ్యక్షుడు కత్తెర్ల సంజీవ్, పట్టణ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
