కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ విజయవంతం

 కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ విజయవంతం

హైదరాబాద్‌:  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు సర్జరీ విజయవంతంగా ముగిసింది. యశోద వైద్యుల బృందం ఆయనకు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ పూర్తి చేశారు. సర్జరీ టైంలో కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం ఆయననున ఒపీడీ నుంచి సాదారణ రూమ్ కి మార్చారు.  కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని.. ఆయన వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు.

డిసెంబర్ 8వ తేదీ గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో పమాదవశాత్తు కేసీఆర్ కాలు జారిపడటంతో.. చికిత్స కోసం శుక్రవారం ఉదయం ఆయనను హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు ఈరోజు రాత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలికడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  కేసీఆర్ ఆరోగ్యంపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.  ఆయన ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటున్నారు.