జగన్ లాంటోడితో యుద్ధం అంటే మనకే నష్టం.. ఆసక్తిరేపుతున్న యాత్ర2 టీజర్

జగన్ లాంటోడితో యుద్ధం అంటే మనకే నష్టం.. ఆసక్తిరేపుతున్న యాత్ర2 టీజర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jaganmohan reddy) జీవితంలో జరిగిన కొత్త సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా యాత్ర2(Yatra2). 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు మహి వి రాఘవ్(Mahi V Raghav) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

యాత్ర 2 టీజర్ చాలా పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ గా సాగింది. వైఎస్సాఆర్ అనంతరం ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటనే విషయాన్ని చాలా ఎమోషనల్ గా చూపించాడు దర్శకుడు. ఆ నేపధ్యంలో వచ్చిన సీన్స్ బాగున్నాయి. తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయి బాధలో ఉన్న జనాలను ఓదార్చటానికి జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర, దానికి రాజకీయ నాయకులు ఎలా అడ్డుపడ్డారు, జగన్ జైలు జీవితం వంటిని ఈ టీజర్ లో చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులను జగన్ ఎలా అధిగమించారు? సీఎం వరకు ఎలా ఎదిగారు అనేది ఈ సినిమాలో చూపించనున్నారు.

సీన్స్ మాత్రమే కాదు టీజర్ లో డైలాగ్స్ కూడా అంతే ఆకట్టుకున్నాయి. ఉన్నదంతా పోయినా పరవాలేదని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టమే, చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో అనవసరం.. కానీ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలు, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని.. అనే డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.