
యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్కిల్ వర్శిటీ బిల్లుపై చర్చ సందర్బంగా మాట్లాడిన ఆయన.. బడ్జెట్ పై బీఆర్ఎస్ నేతలవి చిల్లర మాటలని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు. స్కిల్ వర్శిటీ బిల్లుతో యువత నైపుణ్యం బయటకు తీయొచ్చన్నారు.
ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం ఫోకస్ చేస్తుందన్నారు యొన్నం. ప్రతి జిల్లాలో అనుబంధ క్యాంప్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. స్కిల్ వర్శిటీ తేవడం గర్వించ దగ్గ విషయం అన్నారు. బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు.
Also Read :- హరీశ్,కేటీఆర్ పై స్పీకర్ సీరియస్
స్కిల్ వర్శిటీ బిల్లు సందర్బంగా.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అసెంబ్లీలో యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ బిల్లును ప్రవేశ పెట్టిన శ్రీధర్ బాబు.. జాబ్ క్యాలెండర్ ప్రకారం రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలంటే సాధ్యం కాదని చెప్పారు. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధిని కల్పిస్తామని చెప్పారు. టీజీపీఎస్ పీఎస్ నీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశామని తెలిపారు