అసెంబ్లీలో హరీశ్,కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

అసెంబ్లీలో హరీశ్,కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు, హరీశ్ రావు, కేటీఆర్ పై  స్పీకర్ గడ్డం ప్రసాద్  సీరియస్ అయ్యారు. సభా మర్యాధలు పాటిస్తేనే  మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని చెప్పారు. సభ్యులు నిలబడితే మైక్ ఇవ్వబోనన్నారు.   సభలో  మంత్రి శ్రీధర్ బాబు   యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ బిల్ ను ప్రవేశ పెట్టారు. శ్రీధర్ బాబు మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

దీంతో కల్గజేసుకున్న స్పీకర్ .. సీనియర్ నేతలు, అనుభవం ఉన్న సభ్యులు కూడా సభలో  సభా మర్యాదలు పాటించడం లేదన్నారు. హరీశ్ రావు, కేటీఆర్ కూర్చోవాలని చెప్పారు. కావాలని ఆందోళన చేయడం సరికాదన్నారు.  మహిళలపై అందరికీ గౌరవం ఉందన్నారు. అధికార పార్టీ నేతలకు మహిళలపై గౌరవం లేదా?.మీకే గౌరవం ఉందా అని నిలదీశారు. మహిళలంటే అందరికీ గౌరవమే.. సభ సమయాన్ని వృథా చేయొద్దని హెచ్చరించారు.