యోగాకు పేటెంట్ అవసరం లేదు.. అమెరికాలో మోదీ భారీ ఈవెంట్

 యోగాకు పేటెంట్ అవసరం లేదు.. అమెరికాలో మోదీ భారీ ఈవెంట్

అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా జరిగింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన యోగా డేలో పాల్గొన్నారు. అంతకుమునుపు మహాత్మా గాంధీ విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఐక్యరాజ్య సమితి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన యోగా దినోత్సవం ప్రాముఖ్యాన్ని, కలిగే లాభాలను వివరించారు. మరో ముఖ్య విషయమేమిటంటే అమెరికాలో ఇంత పెద్ద యోగా ఈవెంట్ నిర్వహించటం ఇదే మొదటిసారి.

యోగా భారత్ ప్రాచీనకాలం నుంచి కొనసాగుతున్న ప్రక్రియ అని ప్రధాని మోదీ చెప్పారు. యోగా డే లో అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్న ఆయన.. యోగా అంటేనే అందరినీ కలిపేది అని కితాబిచ్చారు. 2023ని చిరుధాన్యాల ఏడాదిగా భారత్ ప్రతిపాదించిందన్నారు. యోగా చేసేందుకు ఎలాంటి పేటెంట్ హక్కులు అవసరం లేదని మోదీ తెలిపారు. అన్ని దేశాల సంప్రదాయాలకు సరిపోయే విధానం యోగా అని, ఇది కేవలం వ్యాయామం కాదని, ఒక జీవన విధానం అని అన్నారు. యోగా వల్ల మానసిక, శారీక ఆరోగ్యం సమకూరుతుందన్నారు. యోగా డే జరపాలనే ప్రతిపాదనను కూడా దేశాలన్నీ ఆమోదం తెలిపాయని చెప్పారు. భారత ప్రతిపాదనను ప్రపంచమంతా ఆమోదించిందని మోడీ చెప్పుకొచ్చారు. యోగా దినోత్సవంలో పాల్గొన్న అందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యావాదాలు తెలియజేశారు.

https://twitter.com/ANI/status/1671501949722853376