కమెడియన్‌‌ యోగిబాబు టాలీవుడ్ ఎంట్రీ.. ఉడ్రాజుగా తెలుగులోకి..

కమెడియన్‌‌ యోగిబాబు టాలీవుడ్ ఎంట్రీ.. ఉడ్రాజుగా తెలుగులోకి..

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్రం  పాపిరెడ్డి’.  డార్క్ కామెడీ జానర్‌‌‌‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోలీవుడ్‌‌ స్టార్‌‌‌‌ కమెడియన్‌‌ యోగిబాబు ఇందులో కీలకపాత్ర  పోషిస్తున్నాడు. తన బర్త్‌‌ డే సందర్భంగా విషెస్ చెబుతూ.. స్పెషల్‌‌ పోస్టర్‌‌‌‌ను మేకర్స్‌‌ విడుదల చేశారు. ఇందులో అతను ‘ఉడ్రాజు’ అనే పాత్రలో నటిస్తున్నాడని, తన నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.

బ్రహ్మానందం, యోగిబాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  ప్రస్తుత హైదరాబాద్ సిటీ బ్యాక్‌‌డ్రాప్‌‌లో డిఫరెంట్‌‌గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్‌‌తో ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందని మేకర్స్ చెప్పారు.   డా. సంధ్య గోలీ సమర్పణలో వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ)  నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.