రూ. 2వేల నోట్లు మార్పిడికి.. బ్యాంకులకు క్యూ కట్టిన జనం

రూ. 2వేల నోట్లు మార్పిడికి.. బ్యాంకులకు క్యూ కట్టిన జనం

ఆర్బీఐ 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. దీంతో ఇవాళ్టి (  మే 23) నుంచి  నుండి 2 వేల నోట్లను మార్చు కోవడానికి బ్యాంకులకు అనుమతిచ్చింది ఆర్బీఐ.  కౌంటర్‌లో 2 వేల నోట్లను మార్చుకునేందుకు   ప్రజలకు సాధారణ పద్ధతిలో ఏర్పాట్లు చేసింది. రోజుకు 2 వేల నోట్లను 20 వేల వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రిజర్వు బ్యాంకుతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో సెప్టెంబర్ 30 వరకు  డిపాజిట్లు, మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ  క్రమంలోనే  దేశ  వ్యాప్తంగా బ్యాంకుల ముందు 2 వేల నోట్లను మార్చుకునేందుకు జనం క్యూ కట్టారు.

బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు

  • వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకులో  షేడెడ్ వెయిటింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సూచించింది.  
  • డ్రింకింగ్ వాటర్ సదుపాయం మొదలైన శాఖల వద్ద తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలి
  • బ్యాంక్‌లు 2 వేల నోట్ల డిపాజిట్ , మార్పిడికి సంబంధించిన రోజువారీ డేటాను నిర్వహించాలి.
  •  బ్యాంకులు డిపాజిటర్స్ రిసిప్ట్ ఇవ్వాలి
  • బ్యాంకులు 2 వేల నోట్ల మార్పిడికి సంబంధించిన రోజువారీ డేటాను అందించేలా  ఒక ప్రొఫార్మా ను అందించింది ఆర్బీఐ.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023 మే 19  శుక్రవారం రోజున రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది.  మే 23 నుంచి ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసుల్లో 2 వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ  పేర్కొంది. రూ. 2 వేల నోట్లను సర్కూలేషన్‌లో ఉంచొద్దని బ్యాంక్‌లకు ఆదేశించింది. దేశంలో వున్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది