ఏటీఎం కార్డు లేకున్నా డబ్బు తీయొచ్చు

ఏటీఎం కార్డు లేకున్నా డబ్బు తీయొచ్చు

న్యూఢిల్లీ: డెబిట్‌‌కార్డు లేకుండానే యూపీఐ విధానంలో ఏటీఎం నుంచి డబ్బు తీసుకునే విధానాన్ని ఏటీఎం తయారీ కంపెనీ ఎన్సీఆర్‌‌ కార్పొరేషన్‌‌ రూపొందించింది. యూపీఐ సేవలు అందించే నేషనల్‌‌ పేమెంట్స్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫ్ ఇండియా (ఎన్‌‌సీపీఐ), సిటీ యూనియన్‌‌ బ్యాంక్‌‌ కలిసి కార్డ్‌‌లెస్‌‌ విత్‌‌డ్రాయల్‌‌ సదుపాయాన్ని తీసుకొచ్చాయి. దేశంలోని 1,500 సిటీబ్యాంకు ఏటీఎంలలో ఈ ఫెసిలిటీ ఉంది. స్మార్ట్‌‌ఫోన్‌‌లో భీమ్‌‌, గూగుల్‌‌ పే, పేటీఎం, ఫోన్‌‌ పే వంటి ఏదైనా యూపీఐ యాప్‌‌ ఉంటే చాలు కార్డు లేకుండా డబ్బు తీసుకోవచ్చు. 

డబ్బు ఇలా తీసుకోవాలి

  • కార్డ్‌‌లెస్‌‌ విత్‌‌డ్రాయల్‌‌ను సపోర్ట్‌‌ చేసే ఏటీఎం స్క్రీన్‌‌పై ఉండే క్యూఆర్‌‌ కోడ్‌‌ను ఫోన్‌‌ ద్వారా స్కాన్‌‌ చేయాలి. 
  • మనకు కావాల్సిన మొత్తం విలువను టైప్‌‌ చేయాలి. ఫోన్‌‌ ద్వారా ఈ ట్రాన్సాక్షన్‌‌ను ఆథరైజ్‌‌ చేయాలి. వెంటనే డబ్బు బయటకు వస్తుంది. 
  • ప్రస్తుతానికి ఈ విధానంలో రూ.ఐదు వేల కంటే ఎక్కువ తీసుకోవడం సాధ్యం కాదు. త్వరలో విత్‌‌డ్రాయల్‌‌ మొత్తాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి.