ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో కమ్మేసిన పొగమంచు

ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్,  ఖమ్మం జిల్లాల్లో కమ్మేసిన పొగమంచు

వెలుగు, నెట్​వర్క్​: రాష్ట్రంలోని పలు జిల్లాలు మంచుదుప్పటి కప్పుకున్నాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్,  ఖమ్మం జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి పొగమంచు కురిసింది. దీంతో కొద్ది దూరంలో ఏముందో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనదారులు  ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బంది పడ్డారు. ఉదయం పదిగంటల వరకు కూడా మంచు వీడకపోవడంతో లైట్లు వేసుకుని వాహనాలు నడిపారు. 

చలితో గజగజ వణుకుతున్న గ్రేటర్​ వరంగల్​లో ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ దట్టమైన మంచు కమ్మేసింది. అయితే..  ప్రకృతి లవర్స్​ మాత్రం చారిత్రక వరంగల్ ను సిమ్లాలాగా ఊహించుకుని తమ కెమెరాలతో రీల్స్​ చేసుకుంటూ సందడి చేశారు. మొత్తానికి దాదాపు రెండేళ్ల తర్వాత చలికాలం ఎండింగ్​లో ఇలాంటి సుందర దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.