ఓటేయాలంటే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే

ఓటేయాలంటే కరోనా టెస్ట్ చేయించుకోవాల్సిందే

నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటే కరోనా టెస్టు చేయించుకోవాలె

కామారెడ్డి , వెలుగు: అక్టోబర్​ 9న జరిగే నిజామాబాద్​లోకల్​బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలంటే ఓటర్లుగా ఉన్న ప్రజాప్రతినిధులంతా కరోనా టెస్టులు చేయించుకోవాలి. ఇందుకనుగుణంగా ఆఫీసర్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పోలింగ్​కు రెండు, మూడు రోజుల ముందు వరకు ఓటర్లకు టెస్టులు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాలో ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్​అఫీషియో మెంబర్లు  మొత్తం 824 మంది  ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

అన్నీ కరోనా రూల్స్​ప్రకారమే..

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొత్తం కరోనా రూల్స్ కు అనుగుణంగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్​ఆదేశించింది. ప్రచారం సందర్భంగా అభ్యర్థులు మాస్క్​ వేసుకోవాలి. తప్పనిసరిగా ఫిజికల్​డిస్టెన్స్​పాటించాలి. మీటింగ్​లు  కూడా కరోనా రూల్స్​ప్రకారమే పెట్టుకోవాలి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కరోనా కేసులు వేల సంఖ్యలో ఉన్నాయి.  రెండు జిల్లాలో 20వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.  ఈ నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రజాప్రతినిధులకు కరోనా టెస్టులు జిల్లా, ఏరియా, సీహెచ్ సీ హాస్పిటళ్లతో పాటు, పీహెచ్​సీలలో చేయనున్నారు.  పోలింగ్​కు వారం రోజుల ముందు నుంచి ఎప్పుడైనా టెస్టు చేయించుకోవచ్చు. పోలింగ్​సెంటర్​లోకి వెళ్లేముందు కచ్చితంగా రిపోర్టు చూపించాల్సి ఉంది. టెస్టుల్లో ఎవరికైనా పాజిటివ్​ వస్తే వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్పెషల్​గా ఏర్పాట్లు చేస్తున్నారు. పాజిటివ్​ వచ్చినవారు పోస్టల్​బ్యాలెట్​లేదా పీపీఈ కిట్, గ్లౌస్​ధరించి పోలింగ్​ప్రక్రియ ముగిసే గంట ముందు కేంద్రానికి వెళ్లి ఓటేయవచ్చు.

For More News..

పునరావాసం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న మాజీ నక్సలైట్లు

ట్రాక్టర్​ కాలబెట్టి కాంగ్రెస్ రైతుల్ని అవమానించింది

ఇండియాకు గుడ్ బై చెప్పిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్

15 రోజులు పోరాడి ఓడిన మరో నిర్భయ