క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ క్రికెట్ టోర్నమెంట్ లో విషాదం చోటుచేసుకుంది. ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో క్రికెట్ ఆడుతుండగా ఆంజనేయులు (37) అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. క్రికెట్ అడుతున్న సమయంలో అంజనేయులు ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని తెలిపారు డాక్టర్లు. కుమారుడు గుండెపోటుతో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు చూపరులను కన్నీళ్లు పెట్టించాయి.

ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా చనిపోయే వారి సంఖ్య ఎక్కువవుతోంది. వ్యాయామం చేస్తూ.. నడుస్తూ హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. కూర్చుని మాట్లాడుతుండగానే ప్రాణాలు గాల్లో కలిసి పోతున్న పరిస్థితి నెలకొంది. ఇక క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురై చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. గుండెపోటు పదం వినగానే ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి.