అమ్మాయి గొంతుకోసిన యువకుడు

అమ్మాయి గొంతుకోసిన యువకుడు

గచ్చిబౌలి పీస్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో దారుణం జరిగింది. యువతిపై దాడికి యత్నించాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు. ఇంట్లోకి వెళ్లి అమ్మాయిపై కత్తితో దాడి చేశాడు. దీంతో అమ్మాయి గోంతుపై గాయాలయ్యాయి. అమ్మాయి అరుపులతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు.. యువకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అమ్మాయిని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు గచ్చిబౌలి పోలీసులు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

నిందితుడు ప్రేమ్ సింగ్ తమకు దూరపు బంధువని తెలిపారు గాయపడ్డ యవతి కుటుంబ సభ్యులు. బుధవారం రాత్రి 2 గంటలకు ఇంట్లోకి చొరబడి యువతి మెడపై కత్తితో దాడి చేశాడన్నారు. రక్షించుకునే క్రమంలో ఆమె చేతికి కూడా గాయాలయ్యాయని చెప్పారు. స్థానికుల సాయంతో ప్రేమ్ సింగ్ ను పట్టుకున్నామన్నారు. పారిపోకుండా నిందితుడిని కట్టేసి చితకబాదామని తెలిపిన కుటుంబ సభ్యులు అనంతరం  పోలీసులకు అప్పగించామన్నారు. ప్రస్తుతం తమ కూతురి ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు.