
నగరంలో ప్రయాణం సాఫీగా మార్చేందుకు ఉద్దేశించిన మెట్రో రైళ్లు వింతలు విచిత్రాలకు ఆలవాలంగా మారాయి. ఓరోజు ఒకరి డ్యాన్స్, మరోరోజు ప్రేమికుల గొడవ, ఇంకో రోజు తోటిప్రయాణికుల మధ్య తగవు..ఇలా రోజుకో ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారుతుంటుంది. ఇప్పుడు ఓ వ్యక్తి పామును మెడలో వేసుకుని మెట్రోలో ప్రయాణిస్తు్న్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మెట్రో అధికారులపై మండి పడుతున్నారు.
జనాలు కుక్క, పిల్లి, కోడి లాంటి జంతువులను పెంచుకుంటారు. అయితే ఎటైనా వెళ్లేటప్పుడు వాటిని కూడా కూడా తీసుకెళుతుంటారు. ఈ పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలు పెంపుడు జంతువుకాదు కాని.. ఓ మూగ జీవిని పెంపుడు జంతువు మాదిరిగా పామును మెట్రోలో తీసుకెళుతున్నాడు. చదవడానికి నమ్మశక్యం కాకపోయినా ఈ వీడియో చూస్తే నమ్మక తప్పక తప్పదు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి భారీ సైజులో ఉన్న తన పెంపుడు పామును మెడలో వేసుకుని మెట్రో రైలులో నిలుచుకున్నాడు. అయితే అదేం పెద్ద విశేషం కాదు. కాని ఆ వ్యక్తి మెడలో పాము ఉంది. ఆ మెట్రోలోని తోటి ప్రయాణికులు తమ తమ ఫోనుల్లో ఈ వీడియోను రికార్డ్ చేశారు. ఈ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో unilad అనే ఇన్‌స్టా ఐడీ నుంచి 5 రోజుల క్రితం షేర్ అయింది. వార్త రాసే సమయానికి ఈ వీడియోకు 14 వేల లైకులు, 10 లక్షలకు పైగా వీక్షణలు లభించాయి.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు మెట్రో అధికారులపై మండిపడుతున్నారు. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని భారీగా ఫైన్ వేయాలని, అధికారులకు ఫిర్యాదు చేయకుండా కూర్చున్న తోటి ప్రయాణికులు కూడా శిక్షార్హులేనని తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. పాములు లేదా ఇతర ప్రాణాంతక జీవులను పెంచుకునేవారు వాటిని తమ ఇంట్లోనే పెట్టుకోవాలి కానీ ఇలా పబ్లిక్‌లోకి తీసుకురాకూడదని సూచిస్తున్నారు. తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి చేష్టలు చేయడం సరికాదని ఆ యువకుడిని ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు.