నీ బాయ్ ఫ్రెండ్ సూపర్ గా ఉన్నాడు ..కెనడియన్ టూరిస్ట్ తో ఇండియన్ అమ్మాయిల కామెంట్స్

నీ బాయ్ ఫ్రెండ్ సూపర్ గా ఉన్నాడు ..కెనడియన్ టూరిస్ట్ తో ఇండియన్ అమ్మాయిల కామెంట్స్

ఓ కెనడియన్ అమ్మాయి.. కొంతమంది భారతీయ అమ్మాయిల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది..టూరిస్టుగా వచ్చిన కెనడియన్ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్  ఫొటోను చూపిస్తుండగా.. ఇండియన్  టీనేజర్స్ చేసిన కామెంట్స్ ఆసక్తకర చర్చకు దారి తీశాయి. ఇండియన్ అమ్మాయిలు ఇలా కూడా చేస్తారా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. వారు చేసిన దాంట్లో తప్పేంటీ ఎవరికీ హాని కలిగించ లేదు కదా అని మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇలా రకరకాలుగా  కామెంట్లతో నెట్టింట పెద్ద చర్చ పెట్టారు సోషల్ మీడియా యూజర్లు. 

వైరల్ క్లిప్ లో ఏముంది.. ?

ఓ కెనడియన్ అమ్మాయితో కొంతమంది భారతీయ అమ్మాయిలు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నట్లు ఈ వీడియో కనిపిస్తోంది.  వారిమధ్య  కొంత క్లోజ్ నెస్ పెరిగాక  మీ బాయ్ ఫ్రెండ్ ఫొటో చూపించవా అంటూ అమ్మాయిలు సరదాగా రిక్వెస్ట్ చేసినట్లు క్లిప్ లో కనిపిస్తోంది. ఆమె బాయ్ ఫ్రెండ్స్  ఫొటో చేసిన అమ్మాయిలు కొంచె ఉత్సహాంగా.. ‘‘ నీ బాయ్ ఫ్రెండ్ సూపర్ గా ఉన్నాడు ’’  అంటూ కామెంట్స్ చేశారు.. ఇంకొంచెం ఓ అడుగు ముందుకు వేసి ప్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. 

ఈ వీడియో క్లిప్ పోస్ట్  చేసిన కొద్ది సమయంలో భారీగా  లైకులు, వ్యూస్ ను సంపాదించింది. రకరకాలుగా  ఈ వీడియోకు  రిప్లైలు ఇచ్చారు నెటిజన్లు.  ఇలాంటి అమ్మాయిలు ఎక్కువగా ఫెమినిస్టులు ఉంటారంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అది వారి తప్పు కాదు.. వారి తల్లిదండ్రులది.. భారతీయ సమాజంలో బాయ్ ఫ్రెండ్ ఉండటం అనేది పెద్ద తప్పు అంటూ కామెంట్ చేశారు. 

అయితే ఈ వీడియో తోపాటు రాసిన ట్యాగ్ కొంత వివాదానికి దారి తీసింది. ‘‘కెనడియన్  టూరిస్టు దగ్గర ఇండియన్ అమ్మాయిలు వచ్చి ఆమె బాయ్ ఫ్రెండ్ ఫొటోలు చూపించమని అడిగారు.. అభ్యంతరకర కామెంట్స్  చేశారు.. ఒకరు ప్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. యువతులు ఇలా ప్రవర్తించేందుకు ఎలా అనుమతిచ్చారు.. అదే ఒక మేల్ టూరిస్ట్ గర్ల్ ఫ్రెండ్ తో ఒక వ్యక్తి అలా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.