జూబ్లీహిల్స్ ఎన్నికల డేట్ గుర్తుందిగా..! యూసుఫ్‌‌‌‌గూడ కృష్ణకాంత్ పార్కులో భారీ బెలూన్

జూబ్లీహిల్స్ ఎన్నికల డేట్ గుర్తుందిగా..! యూసుఫ్‌‌‌‌గూడ కృష్ణకాంత్ పార్కులో భారీ బెలూన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు స్వీప్ (సిస్టమెటిక్ ఓటర్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ ) నిర్వహిస్తున్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు వివిధ రకాలుగా అవెర్​నెస్ కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా యూసుఫ్‌‌‌‌గూడ కృష్ణకాంత్ పార్కులో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ  భాషలతో భారీ బెలూన్‌‌‌‌ ప్రదర్శించారు. దీనిపై పోలింగ్ తేదీని భారీ అక్షరాలతో ప్రదర్శించి, ఓటు హక్కు వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.