ఇన్ స్టాలో పరిచయమై బాలికను .. మోసగించిన యువకుడు అరెస్ట్

ఇన్ స్టాలో పరిచయమై బాలికను .. మోసగించిన యువకుడు అరెస్ట్

పద్మారావునగర్, వెలుగు: ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమైన యువకుడు ప్రేమ పేరుతో ఓ బాలికను నమ్మించాడు. నగలు, డబ్బులు తీసుకుని మోసగించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ జోన్​ డీసీపీ ఆర్. గిరిధర్​ మంగళవారం మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. చిలకలగూడలోని ప్రభుత్వ ఉద్యోగి దంపతుల ఇంట్లో బంధువైన బాలిక(13), నాలుగేండ్లుగా ఉంటూ చదువుకుంటోంది. 

గత జనవరిలో బాలిక తన పెద్దనాన్న శ్రీనివాసరావు షర్ట్ లో రూ.3 వేలు, కొద్దిరోజులకు నగలు, నగదు కనిపించలేదు. దీంతో బాలికను ప్రశ్నించి.. ఆమె మొబైల్​ చెక్ చేశారు. ఇన్ స్టాలో ఓ అబ్బాయితో చాటింగ్ ​చేసినట్లు గుర్తించారు. కడపకు చెందిన వాడిగా..  బెంగళూర్​లో డిగ్రీ చదువుతున్నట్టు చెప్పలి విజయ్​కుమార్​(19) గా బాలికకు చెప్పాడు.  తన పేరెంట్స్ కు ఆరోగ్యం బాగాలేదని చెబితే బాలిక 16 తులాల బంగారు నగలు,  రూ. లక్షా 50 వేల నగదు ఇంట్లో చోరీ చేసి అతనికి ఇచ్చినట్టు స్పష్టమైంది. 

అయితే.. అతడు నగలను తాకట్టు పెట్టి.. వచ్చిన డబ్బుతో  ఎంజాయ్ చేస్తూ.. ఆన్​ లైన్ ​క్రికెట్ ​బెట్టింగ్​పెట్టినట్టు తేలింది.  దీంతో బాధితులు చిలకలగూడ పీఎస్ లో కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా ఆశ్యర్చపోయే విషయాలు తెలిశాయి. సిటీలోనే ఉండే విజయ్​కుమార్​ ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకుని, సినిమాలు, షికార్లకు  తీసుకెళ్లి లైంగిక చర్యలకు కూడా పాల్పడినట్టు గుర్తించారు. సోమవారం నిందితుడు విజయ్​కుమార్​ను అరెస్టు చేసి  ఫోక్సో, డైవర్టింగ్ అటెన్షన్ తదితర కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. బాలికను భరోసా సెంటర్ కు పంపించారు. 16 తులాల బంగారు నగలను రికవరీ చేసిన పోలీస్​ సిబ్బందిని అభినందించి.. రివార్డులను అందజేశారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, ఎస్ హెచ్​వో అనుదీప్​, లాలాగూడ ఎస్​హెచ్​వో రమేశ్​ గౌడ్, కానిస్టేబుళ్లు ఉన్నారు.