శివ్వంపేట, వెలుగు: దాగుడుమూతలు ఆడుకుందామని చెప్పి బాలికపై లైంగిక దాడికి యత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో రాత్రివేళ ఇంటి నుంచి బయటికి వచ్చిన తొమ్మిదేళ్ల బాలికను ఓ యువకుడు(20) దాగుడుమూతలు ఆడుకుందామని చెప్పి పక్కకు తీసుకెళ్లాడు.
అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి యత్నించగా బాలిక కేకలు వేసింది. సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
