V6 News

యువత సైంటిస్టులుగా ఎదగవచ్చు: మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు

యువత సైంటిస్టులుగా ఎదగవచ్చు: మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు

రాయికల్, వెలుగు: యువత ఉద్యోగం రాలేదని బాధపడొద్దని, టెక్నిషీయన్‌‌‌‌ కోర్సులు పూర్తి చేసి సైంటిస్టులుగా ఎదగవచ్చని మహారాష్ట్ర మాజీ గవర్నర్​ చెన్నమనేని విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రావు సూచించారు. జగిత్యాల జిల్లా రాయికల్​ పట్టణంలోని జీయర్​ఎడ్యుకేషనల్​ట్రస్టులో జీఎంఆర్ వరలక్ష్మి​, ప్రతిమ ఫౌండేషన్​ సంయుక్తంగా యువతకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇస్తోంది. 

ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన యువతకు శుక్రవారం ధ్రువీకరణ పత్రాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పెడదారి పట్టకుండా ఉపాధి రంగాలను ఎంచుకోవాలన్నారు. నిరుద్యోగ యువతకు హాస్టల్‌‌‌‌ కోసం ఎమ్మెల్యే రూ.30లక్షల మంజూరుకు హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు. 

ఆర్ఎస్ఎస్​ రాష్ట్ర ప్రచారక్​ లింగం శ్రీధర్​జీ, మున్సిపల్​ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ కట్కం రవీందర్‌‌‌‌‌‌‌‌, జీయర్​ ఎడ్యుకేషనల్​ ట్రస్టు ఇన్‌‌‌‌చార్జి ఏఎం రాజురెడ్డి, ప్రతిమ ఫౌండేషన్‌‌‌‌ ప్రోగ్రాం మేనేజర్​గీతారెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు.