
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్‌లోని 19వ వార్డుకు చెందిన పద్మకు రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసినట్లు యువజన కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ విజయ్ అగర్వాల్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనారోగ్యానికి గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నవారు హాస్పిటల్ ఒరిజినల్ రశీదులు, ఇతర ధ్రువీకరణపత్రాలతో పీవీఆర్ భవన్ లో ఆన్లైన్లో అప్లై చేయాలన్నారు.
అర్హులకు కచ్చితంగా ఆర్థిక సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సడాక్ వినోద్, బత్తుల శ్రీనివాస్ గౌడ్ తదితరులుపాల్గొన్నారు.