ప్రభుత్వ ఆఫీసుల్లో కంప్లయింట్ బాక్స్​ ఏర్పాటు చేయాలి: యూత్ ఫర్ యాంటీ కరప్షన్

ప్రభుత్వ ఆఫీసుల్లో కంప్లయింట్ బాక్స్​ ఏర్పాటు చేయాలి: యూత్ ఫర్ యాంటీ కరప్షన్

ఖైరతాబాద్, వెలుగు: ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కంప్లయింట్ బాక్స్​ను ఏర్పాటు చేయాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పిలుపునిచ్చింది. గురువారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆఫీసు​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, సంస్థ ఫౌండర్ రాజేంద్ర ఈ ఫిర్యాదుల బాక్స్ ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆఫీసుల్లో జనాలు ఎదుర్కొనే సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకునేలా కంప్లయింట్ బాక్స్​లను ఏర్పాటు చేయాలన్నారు.

వారానికి ఒక‌‌సారి బాక్స్​ను ఓపెన్​చేసి అందులో వ‌‌చ్చే స‌‌మ‌‌స్యలు, కంప్లయింట్లు, అధికారుల మంచిత‌‌నాన్ని బ‌‌హిర్గతం చేయాల‌‌ని కోరారు. కార్యక్రమంలో యూత్ ఫ‌‌ర్ యాంటీ క‌‌ర‌‌ప్షన్ స‌‌ల‌‌హ‌‌దారు  ప్రతిభాలక్ష్మి త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు.