పరిగి, వెలుగు: పరిగి మున్సిపల్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఉన్న స్మశాన వాటికలో ఓ యువకుడు మర్రిచెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాశబండతాండకు చెందిన దీపక్ (26) పరిగిలో అద్దెకు ఉంటూ మేస్త్రీ పని చేస్తున్నాడు.
మంగళవారం ఉదయం స్మశాన వాటికలోని చెట్టుకు దీపక్ మృతదేహం వేలాడుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇది ఆత్మహత్యా లేక హత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
