హైదరాబాద్, వెలుగు: వైఏఐ సికింద్రాబాద్ క్లబ్ జీఎంఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగెట్టా జాతీయ ర్యాంకింగ్ పోటీలు సోమవారం హుస్సేన్ సాగర్‌లో ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో 113 మంది యువ సెయిలర్లు పాల్గొంటున్నారు.
ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్, గ్రీన్ ఫ్లీట్, ఐఎల్‌సీఏ 4, ఐఎల్‌సీఏ 6 ఓపెన్, మిక్స్‌డ్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ప్రతి విభాగంలో 10 రేసులు నిర్వహిస్తారు. సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్, ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి.
