ఇన్స్టాగ్రామ్ రీల్స్...ఆల్కహాల్ అడిక్షన్ కనే డేంజరస్ గా మారుతోంది. రీల్స్ పిచ్చిలో పడి టైం వేస్ట్ చేసుకుంటున్నవారు కొంతమంది అయితే, రీల్స్ కోసం రిస్క్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మరికొందరు. ముఖ్యంగా హైదరాబాద్ రోడ్ల మీద ఇలాంటి బ్యాచ్ ఎక్కువైపోతున్నారు. గచ్చిబౌలి, రాయదుర్గం లాంటి ఏరియాల్లో ప్రమాదకరంగా రీల్స్ చేస్తున్న యువత గురించి తరచూ వార్తలొస్తున్నాయి.. ఇప్పడు బాచుపల్లి ఫ్లైఓవర్ పై కూడా రీల్స్ బ్యాచ్ తయారవుతున్నారు. ప్రమాదకరంగా డ్యాన్స్ రీల్స్ చేస్తున్నారు యువత.
బాచుపల్లి ఫ్లైఓవర్ పై అర్థరాత్రి ప్రమాదకరంగా డ్యాన్స్ రీల్స్ చేస్తూ కనిపించారు కొంతమంది యువతీయువకులు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలో యువతులు డ్యాన్స్ చేస్తుండగా యువకులు వీడియో షూట్ చేస్తున్నారు. వేగంగా దూసుకెళ్తున్న వాహనాల మధ్య రీల్స్ చేస్తూ ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు.
Dance reels on Bachupally Flyover spark safety fears
— Hyderabad Mail (@Hyderabad_Mail) September 24, 2026
People have started making late-night dance videos on the Bachupally Flyover, dancing on the road while cars drive by at high speeds. This new trend has worried both residents and safety experts.
Filming on the busy… pic.twitter.com/fEwu2h5oBC
ఫ్లైఓవర్‌పై రీల్స్ ట్రెండ్‌పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ చేస్తున్నవారికే కాకుండా వాహనదారులకూ ప్రమాదమని అంటున్నారు. సడన్ బ్రేకులు వేయాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు వాహనదారులు.
ఫ్లైఓవర్‌పై రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. రీల్స్ కోసం రోడ్డుపైకి వచ్చేవారిని అడ్డుకోవాలని.. ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు.
