
సోషల్ మీడియాలో కొందరు చేసే చిలిపి వీడియోలకు మిలియన్ల వ్యూస్ రావడం చూస్తూనే ఉంటాం. కానీ కొన్ని సార్లు ఈ చిలిపి చేష్టలే అవతలి వారి కోపానికి కారణమవుతాయి. తప్పుగా అర్థమవడమే గాక.. దాని వల్ల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి ఉదాహరణే.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో.
రెక్ లెస్ యూత్ అనే యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేస్తున్నట్టు కనిపించింది. అంతలోనే షార్ట్, తెల్లటి టాప్ ధరించి, ముసుగు వేసుకున్న మరొక వ్యక్తి వచ్చి అతన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. నాకు డబ్బు ఇవ్వు అని గట్టిగా అరుస్తాడు. ఈ పనులన్నీ ఆ వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో అమలు చేయడంతో చుట్టూ ఉన్న వారు దాన్ని గమనించారు. వారిలోనుంచి ఓ ప్రజా ప్రతినిధి వచ్చి, వారి చిలిపి పనులకు కళ్లెం వేశాడు.
అతనితో పాటు చాలా మంది వచ్చి దోపిడీ చేసే వ్యక్తిని అడ్డుకున్నారు. అలా అతని ముక్కుపై కొట్టారు. వాళ్లకు నిజంగా కోపం వచ్చిందని గ్రహించిన ఆ వ్యక్తి ఇది జోక్ గా చేశానని అరవడం మొదలుపెట్టాడు. చివర్లో ముక్కు నుంచి రక్తం కారుతున్నపుడు ఆ వ్యక్తి ముక్కుకు ఓ గుడ్డను అడ్డుగా పెట్టుకున్నాడు. అలా చిలిపి పని అని చేయబోయి చివరికి తన ముక్కును పగలకొట్టుకున్నాడు. పబ్లిక్ ప్లేస్ లో దోపీడీ జరిగితే ప్రజలు ఎలా స్పందిస్తారో ప్రయోగం చేశామని యూట్యూబర్ చివర్లో నివేదించాడు.