పాపప్రక్షాళన కోసమే కేసీఆర్ ధర్నా

పాపప్రక్షాళన కోసమే కేసీఆర్ ధర్నా

టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మహాధర్నాపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతకాక కేసీఆర్ ధర్నాలు చేస్తున్నారన్నారు. కమిషన్ల కోసం కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వొచ్చు..లిక్కరు ఏరులై పారొచ్చు.. కాని రైతు పండించిన పంట కొనలేరా అంటూ ప్రశ్నించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొంటారో..కొనరో తెలియక రైతుల గుండెలు ఆగిపోతున్నాయన్నారు.

నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చావు బాట పట్టిస్తూ, బడి బువ్వ బంద్ పెట్టి పేద బిడ్డలకు చదువును దూరం చేస్తూ నేటి తెలంగాణాను.. రేపటి భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారు అని అన్నారు షర్మిల. ఈ పాపం నాది కాదు అన్నట్టు.. ఇవాళ రైతుల పేరుమీద దొంగ దీక్షలు చేస్తున్నారని అన్నారు. పాపప్రక్షాళన చేసుకోవడానికి ధర్నాలు చేస్తున్న మీరు ముమ్మాటికీ రైతు ద్రోహే అంటూ కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. మరో రైతు గుండె ఆగకముందే..తడిసిన ధాన్యం తో పాటు,కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఆఖరి గింజవరకు  కొనాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.

అంతేకాదు...తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ నోఫికేషన్లపైనే తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ షర్మిల. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..ఏజ్ లిమిట్  పెంపునకు కృషి చేస్తామని ..వెంటనే ఖాళీలను భర్తీ చేస్తామని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు షర్మిల.