
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీ చరిత్ర గర్వించే రోజని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని షర్మిల ట్వీట్ చేశారు.
తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. 15 ఏండ్ల క్రితం ఒకే దఫాలో దేశవ్యాప్తంగా నాటి యూపీఏ సర్కారు రుణమాఫీ చేసిందని ఆమె అన్నారు.