
టీఆర్ఎస్ ప్రభుత్వంపై YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వం వేలానికి పెట్టిందంటూ ఆరోపిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అంతేకాదు.."రియల్ ఎస్టేట్ దోపిడీ నుంచి పేద మధ్యతరగతి ప్రజలను కాపాడి, వారి సొంతింటి కలను నెరవేర్చాలని సంకల్పించి, మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే ఇండ్లను అందివ్వాలని రాజీవ్ స్వగృహను రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేస్తే, దొరగారేమో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుడు పక్కన పెట్టి, మధ్యతరగతి బతుకులు ఎప్పుడు ఇండ్లు లేకుండానే ఉండాలని, కమిషన్ల కోసం, ఖజానా నింపుతం అన్న వంకతో, తన మిత్ర బృందానికి, రియల్ ఎస్టేట్ భజన బ్యాచ్ కు టవర్ల లెక్కన రాజీవ్ స్వగృహ ఇండ్లను వేలానికి పెట్టి జేబులు నింపుకుంటున్నాడు. KCR గారి బంగారు తెలంగాణ అంటే అమ్ముకతినుడు.అందినకాడికి దోచుకునుడే కదా!’ అని షర్మిల ట్విట్టర్ ద్వారా విమర్శించారు.
బతుకులు ఎప్పుడు ఇండ్లు లేకుండానే ఉండాలని, కమిషన్ల కోసం, ఖజానా నింపుతం అన్న వంకతో, తన
— YS Sharmila (@realyssharmila) February 25, 2022
మిత్ర బృందానికి, రియల్ ఎస్టేట్ భజన బ్యాచ్ కు టవర్ల లెక్కన రాజీవ్ స్వగృహ ఇండ్లను వేలానికి పెట్టి జేబులు నింపుకుంటున్నాడు. KCR గారి బంగారు తెలంగాణ అంటే అమ్ముకతినుడు.అందినకాడికి దోచుకునుడే కదా! 2/2
మరిన్ని వార్తల కోసం..