మంత్రి కేటీఆర్ కామెంట్లపై షర్మిల ఫైర్

మంత్రి కేటీఆర్ కామెంట్లపై షర్మిల ఫైర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర నిరుద్యోగులు మీకు సన్నాసుల్లా కనిపిస్తున్నారా ? అని మంత్రి కేటీఆర్ పై షర్మిల ఫైర్ అయ్యారు. ఉద్యోగాలపై ఎక్కడని నిలదీస్తే, జనం చెత్త  నా కొడుకులు, సన్నాసుల  లెక్క కనిపిస్తున్నరా?  అని ఆమె మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగమిస్తమని మాట ఇచ్చిన కేసీఆర్, కేటీఆరే సన్నాసులని మంగళవారం ట్వీట్ చేశారు. “ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి తండ్రీకొడుకులకు మతి భ్రమించినట్లుంది.10 ఏండ్లు అధికారమిస్తే 65 వేల ఉద్యోగాలు ఇయ్యలేదు. మళ్లీ అధికారమిస్తే జాబులు, ఇండ్లు వడ్లు పండించినట్లు వరద పారిస్తడట. అధికార మదంతో కళ్లు నెత్తికెక్కాయి” అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.