
తాలిబాన్ల చేతిలో అఫ్గానిస్తాన్ లా.. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయి ఉందని విమర్శించారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు బాధ కలిగిస్తున్నాయన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యలే అన్నారు. ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు చనిపోతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఆత్మహత్యలను ఆపలేని సర్కార్ రాష్ట్రంలో ఉందన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ లో నిరుద్యోగ దీక్ష చేశారు షర్మిల. ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తారో చెప్పాలన్నారు షర్మిల.